సిరాన్యూస్, ఆదిలాబాద్
కైలాష్ నగర్ భూకబ్జా దారుల పై కఠినంగా చర్యలు తీసుకుంటాం: ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డి
కైలాష్ నగర్ భూకబ్జా దారుల పై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆర్‌డీఓ జీవాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ వార్డు 38 లో సొసైటీ కీ సంబంధించిన పది కోట్ల విలువ గల 8 ప్లాట్లలో 2 ప్లాట్లని తప్పుడు ధ్రువ పత్రలతో కబ్జాలు చేయడానికి ల్యాండ్ మ్యాఫియా ప్రయత్నిచగా కైలాష్ నగర్ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షులు లోక ప్రవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్, ప్రధాన కార్యదర్శి ముత్యాల చిట్టిబాబుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కలిసి సమస్యను జిల్లా కలేక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆర్‌డీఓ, తహసీల్దార్ , మున్సిపల్ కమిషనర్ తో బుధవారం కైలాష్ నగర్ కబ్జా చేసిన ప్లాట్స్ వద్దకు వెళ్లి దర్యాప్తు చేశారు. ఇందులో బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. కబ్జా స్థలంలో విచారణ జరిపిన అధికారులు కబ్జాదారులను పత్రాలు చూపాలని ఆదేశించారు. కబ్జా చేసిన దుండగులు సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచడంతో నివేదికను కలెక్టర్కు అందించి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సభ్యులు రాంకిషన్, రాంకుమార్, రాంరెడ్డి, కొండల్ రావ్, ఈశ్వర్ దాస్ బాబురావు, రాజారామ్, పెంటజీ, రాకేష్, ప్రవీణ్అగర్వాల్, మాధస్తూ మహేందర్,త్రినాధ్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు