కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు

సిరా న్యూస్,విశాఖపట్నం;
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అధ్యక్షతన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో విద్వాంసకర పాలన జరిగిందని,నాయకులు విశాఖను దోచుకున్నారని,ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి కొందరు నాయకులు త్యాగాలు చేశారని, మూడు పార్టీలలో కష్టపడి పని చేసినవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని,గత వైసిపి ప్రభుత్వం వైఫల్యల వలన ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *