సిరాన్యూస్, ఆదిలాబాద్
రక్తదానం చేసిన ఎస్పీ గౌష్ ఆలం
జిల్లాలో నాలుగు చోట్ల రక్తదాన శిబిరం ఏర్పాటు
స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 250 మంది పోలీసులు ప్రజలు యువత
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో లో ఏర్పాటు చేయబడిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తదుపరి అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 250 యూనిట్ల పోలీసులు, ప్రజలు, ఔత్సాహికుల రక్తాన్ని రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానాన్ని చేయడంతోపాటు, సోదరుడు డాక్టర్ జిలాని, మిత్రుడు వికాస్ ఐఆర్ఎస్ రక్తదానాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమరవీరుల సమస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఒకప్పటి పోలీసులు చేసిన త్యాగాలను జిల్లా ప్రజలకు సవివరంగా వివరించి పోలీసులు చేసే విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. వృత్తిరీత్యా పోలీసులు డాక్టర్లు ఉన్నతమైన వ్యక్తిత్వంy భావాలు కలవాలని వారిని ప్రజలు గౌరవించాలని సూచించారు. రక్తదానం శిబిరం పెద్ద ఎత్తున ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ రక్తదాన శిబిరంలో డిఎం అండ్ హెచ్ ఓ కృష్ణ, డాక్టర్లు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, బి సురేందర్ రెడ్డి, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు, ప్రజలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.