Red Cross Society Rupesh Reddy: వరద బాధితులకు తాడిపత్రిల పంపిణీ : రెడ్ క్రాస్ సొసైటీ మండ‌ల‌ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
వరద బాధితులకు తాడిపత్రిల పంపిణీ : రెడ్ క్రాస్ సొసైటీ మండ‌ల‌ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి

గత వారం రోజుల క్రితం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చి నష్టపోయిన వరద బాధితుల పట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఔధర్యం చాటుకున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం గణేష్ పూర్ గ్రామ పంచాయతీలో గల కడ్కి గ్రామంలో వరదలతో గుడిసెల ఇల్లు కూలిపోయి బాధపడుతున్నటువంటి ఆదివాసి బీద కుటుంబాలను గుర్తించి బుధవారం బేల మండల్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలను పంపిణీ చేసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్ బేల మండలం సొసైటీ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఆదివాసి కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ ఎంతో అండగా ఉంటుందని పేర్కొన్నారు.వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసిన తమ ఇంటి పైకప్పులకు ప్రమాదం లేకుండా ఉండేందుకు ఈ తాడిపత్రిలను అందజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎం.సి.మెంబర్ విజయ్ బాబు,కోఆర్డినేటర్ లు దొంతుల ప్రవీణ్,నరేష్,బోక్రే శంకర్,ఠాక్రే సాగర్,కన్య రాజు,గ్రామస్తులు హుసేన్ పటేల్,సోను తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *