సిరా న్యూస్, గుడిహత్నూర్:
బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి…
-మంత్రిని కోరిన తుల అరుణ్ కుమార్…
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తుల అరుణ్ కుమార్ విన్నవించారు. ఆదివారం హైదరాబాద్ లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు. స్థానిక ప్రజలు బోథ్ ను డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా సానుకూలంగా స్పందించిన మంత్రి బోథ్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.