సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఐటీడీయే పరిధిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆద్వర్యం లో అందిస్తున్నా వైద్య సేవల బలోపేతం పై హైదరాబాదులోని దామోదర సంజీవయ్య భవన్ లోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భవనం లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఐటీడీయే పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మున్ననూరు లతో పాటు ఇతర జిల్లాలలో ఉన్న గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, గిరిజన శాఖ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష లో అచ్చం పేట ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ, హెల్త్ సెక్రటరీ డా . క్రిస్టినా , గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ , ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రజాఆరోగ్యశాఖ సంచాలకులు డా. రవీంద్రా నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్, ఐటీడీయే అధికారులు పాల్గొన్నారు.