సిరా న్యూస్,కోదాడ;
నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద తెగిన ఎడమ కాలువ నీటి ప్రభావం కొనసాగుతూనే ఉంది.ఆదివారం ఉదయం సాగర్ ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటర్ వద్ద ఒక గండి 119 కిలోమీటర్ల వద్ద మరొక గండి ఏర్పడడంతో విషయం తెలుసుకున్న ఎన్ఎస్పి సిబ్బంది సాగర్ ఎడమ కాలువ ఆపివేసినప్పటికీ నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు 7 అడుగుల మేర ఈ నీటి ప్రవాహం సాగుతుంది. దీంతోపాటు పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి ప్రవాహం వెనక్కి వస్తుండడంతో ఈ వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఈ కాల్వ కింద ఉన్న సుమారు 4000 ఎకరాల పంటలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంతో పాటు కరివిరాల ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గరలోనే నాలుగు తండాలను ఈ నీటి ప్రవాహం ముంచేతుంది. ఈ నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.