సిరాన్యూస్, సైదాపూర్:
ఈ తీర్పు కాంగ్రెస్ చెంపపెట్టు లాంటిది: సైదాపూర్ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రుద్రారపు శ్రావణ్ కుమార్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని సైదాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రుద్రారపు శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం సైదాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురికావడం తధ్యమని అన్నారు. కార్యక్రమంలో రంజిత్, కుమార్, రాకేష్, అనీష్ పాల్గొన్నారు.