రైతుల పట్టా పాస్ బుక్ ల పై సుమారు కోటి వరకు రుణాలు
రికవరీ కోసం రైతుల ఇంటికి అధికారులు రావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన..
సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా పడగల్ గ్రామ సహకార సంఘంలో ఐదు సంవత్సరాల క్రితం సెక్రటరీగా విధులు నిర్వహించి ప్రస్తుతం కొలీప్యాక్ లో విధులు నిర్వహిస్తున్న కొత్త దయాకర్ రైతుల వద్ద నుండి వారి అనుమతి లేకుండా పట్టా పాస్ బుక్ లపై క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది లోన్ రికవరీ అధికారులు రైతుల వద్దకు వచ్చి మీ భూమిపై లోన్ ఉందని కట్టని యెడల ఇంటిని వేలానికి వేస్తామని బెదిరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది మోసపోయామని తెలిసిన బాధితులు పీఏసీసీ పడగల్ ముందర ధర్నా నిర్వహించారు రైతులను నట్టేట ముంచిన సెక్రెటరీ పై చర్యలు తీసుకునేంతవరకు ఉపేక్షించేది లేదని రైతుల భీష్మించుకు కూర్చున్నారు.
మా భూములపై తీసుకున్న లోన్లను అధికారులు మాఫీ చేసి బాధితుల తరఫున అండగా నిలబడాలని కోరుకున్నారు. పిఎసిసి కి చేరుకున్న విచారణ అధికారి మురళి బాధితుల వాంగ్మూలాన్ని సేకరించి విచారణ చేపడతామని తెలియజేశారు.