సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. సెల్ఫీ వీడియో అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ పిఎం పాలెం క్రికెట్ స్టేడియం దగ్గరి వి కన్వెన్షన్ లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కొవ్వూరు గణేష్ గా పోలీసులు గుర్తించారు. హోటల్ సిబ్బంది పిర్యాదుతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు గణేష్ రెండు రోజుల క్రితం వి కన్వెన్షన్ లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. పీ ఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.