మంత్రి దామోదర రాజనర్సింహ
సిరా న్యూస్,హైదరాబాద్;
కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి. నాన్ కమ్యునికేబుల్ డిసీజ్‌లు అన్నింటిలోకెల్లా కేన్సర్ అత్యంత ప్రమాదకరమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం నాడు అయన ఎంఎన్ జే ఆసుపత్రిని సందర్శించారు. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయి. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నయి. కేన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.
మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం వుమెన్ కేన్సర్ బర్డెన్‌లో 14 శాతం బ్రెస్ట్ కేన్సర్ సంబంధిత కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్‌లో రోగ నిర్దారణ చేయొచ్చు. తద్వారా కేన్సర్‌ను పూర్తిగా నయం అయ్యేలా ట్రీట్మెంట్ అందించొచ్చు.ప్రతి మహిళా స్క్రీనింగ్ చేయించుకోవడానికి ముందుకు రావాలి.ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అందిస్తోంది.ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తాం.6 కేన్సర్ రీజినల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
ఈ సెంటర్లలో డాక్టర్లు, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తీసుకొస్తాం. ఈ సెంటర్లు అన్నింటికీ ఎంఎన్‌జే హాస్పిటల్ హబ్‌గా ఉంటుంది. కేన్సర్ ట్రీట్మెంట్ ఒక్కరోజులోనో, ఒక్క వారంలోనో అయ్యేది కాదు, నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుంది. పేషెంట్లకు ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం.. దానికోసమే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. డయాబెటీస్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.