సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును కలిసిన శ్రవణ్ నాయక్
కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ్య న్యాయవాది శ్రవణ్ నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, నియోజక వర్గ అభివృద్ధి, తదితర అంశాలను గురించి కొద్ది సేపు చర్చించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో న్యాయవాది సుభాష్ రాథోడ్, నాయకులు రాజేందర్, స్వామి, తదితరులు ఉన్నారు.