SI Ashok Reddy: గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : పోత్కపల్లి ఎస్సై జి. అశోక్ రెడ్డి

సిరాన్యూస్ , ఓదెల
గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : పోత్కపల్లి ఎస్సై జి. అశోక్ రెడ్డి

గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాల‌ని పోత్కపల్లి ఎస్సై జి. అశోక్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.మండల పరిధిలోని గణేష్ నవరాత్రులను దృశ
గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల‌న్నారు., ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ పోర్టల్ వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని , మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అని, గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి అని,షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి అని, గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి అని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,ఇసుక ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *