సిరాన్యూస్, ఇచ్చోడ
కామగిరి అంగన్వాడీ కేంద్రంలో పోషణ వారోత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్బంగా శుక్రవారం అంగన్వాడి టీచర్ అబేధా బేగం పోషకాహార విలువలపై గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమంమని, గర్భిణీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు, ఆకుకూరలు కూరగాయలు పాలు, గుడ్లు మాంసం చేపలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు. దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని తెలియజేశారు. బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన తొందరగా కోలుకోలేరని పూర్తి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హజార్ హమీద్, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.