సిరా న్యూస్,చేబ్రోలు;
గత కొద్ది కాలంగా కురుస్తున్న తుఫాను కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లో తుఫాన్ బాధితులకు తను వంతుగా 6 కోట్ల రూపాయలు సాయాన్ని ప్రకటించి పవన్ కళ్యాణ్ తన సహృదయాన్ని చాటుకున్నారు. పిఠాపురం చేబ్రోలు లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుండి భారీ ఎత్తున ఆహార సామాగ్రి మూడు వాహనాల్లో తరలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని మీడియాకి ఎన్ఆర్ఐ జనసేన సంఘం ప్రతినిధులు తెలిపారు. 15 టన్నుల ఆహార సామాగ్రిని మంగళగిరి పార్టీ కార్యాలయా నికి వరద బాధితుల సహాయార్థం తరలించారు. సుమారు 20 లక్షలు విలువ చేసే ఆహార సామగ్రి, అమెరికన్ ఎన్నారై అనిశెట్టి స్వామి సంఘం తరఫున పంపిస్తున్నట్టు ఎన్నారై సంఘ సభ్యుడు చిక్కాల సుబ్బారావు వెల్లడించారు. .