సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ : ఎస్సై దివ్య
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలోని మండల బిఆర్ఎస్ నాయకులను వంగర ఎస్సై దివ్య ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి నిరసన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాదులో నిర్వహిస్తున్న ధర్నా పిలుపుమేరకు హైదరాబాద్ కు తరలి వెళ్తారని ముందస్తు సమాచారంతోనే అరెస్టు చేశామని ఎస్సై దివ్య తెలిపారు.ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కండె సుధాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని,రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సండే సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ నల్లగొని రాజు, కాల్వ సంపత్,గిన్నరపు కుమార్ స్వామి, మంచాల శ్రీనివాస్,వేముల రమేష్, గుర్రపు తిరుపతి,బత్తిని బాలయ్య,గిద్దె చింటూ,దొంత అశోక్,ఏనుక రాములు, రాకేష్ కనకయ్య ఉన్నారు.