సిరాన్యూస్, భీమదేవరపల్లి
కులాన్ని బహిష్కరించే హక్కు ఎవరిచ్చారు ..? : తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
* కుల బహిష్కరణ ఇంకెన్నాళ్లు
కులాన్ని బహిష్కరించే హక్కు ఎవరిచ్చారని, డప్పు కొట్టకపోతే ఒక కుటుంబాన్ని బహిష్కరించడం పై తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం ఈ సందర్బంగా భీమదేవరపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా కుల బహిష్కరణ జరుగుతున్న గత 78 సంవత్సరాలు దాటిన ఆనాటి నుండి నేటి వరకు కులాన్ని బహిష్కరిస్తూ ఉన్నారని, దళితుల తోటి ఎట్టి చాకిరి చేయించుకుంటూ వారిని కుల బహిష్కరణ చేస్తూ ,వారి పైన దాడులు ,దౌర్జన్యాలు, హత్యలు,మానభంగాలు భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిస్తే దళితుల పైన దాడులు జరిగేవా..? సమాజంలో మమ్మల్ని ఈరోజు వరకు ఈ ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న చులకనగా చూడటం ఏంటి…అని ప్రశ్నించారు. ఒకరేమో రిజర్వేషన్ ఎందుకు తీసేయాలంటూ, ఇంకొకరు డప్పులు కొట్టకపోతే కుల బహిష్కరణ చేస్తారు మానవ సమాజంలో ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కంప్యూటర్ యుగంలో కూడా దళితులకు అవమానాలు తప్పడం లేదన్నారు. డబ్బు కొట్టకపోతే కుల బహిష్కరణ చేసిన మెదక్ జిల్లా, మనోహర్ మండలం ,గోతోజి గూడెంలో మంగళవారం బాధితులు విషయమై శంకరయ్య- నరసమ్మ నలుగురు సంతానం ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు చంద్రం అర్జునులతో కలిసి గ్రామంలో నివసిస్తున్నారని తెలిపారు. శంకరయ్య పలు కార్యక్రమాలలో డప్పుకొట్టేవాడు తండ్రి మరణం తర్వాత చంద్రు డప్పు కొట్టేవాడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు, పలుమార్లు డప్పు కొట్టుటకు పోవడం వల్ల ఉద్యోగం నుండి తొలగించారని, అప్పటి నుంచి డప్పు కొట్టడం మానేశారు .రెండు రోజుల క్రితం కుల పెద్దలు గ్రామస్తులు ప్రశ్నించారు తమకు వీలుకాదని చెప్పడంతో అలాగైతే మీరు ఊర్లో ఉండదని కుల బహిష్కరణ చేస్తున్నామని నిన్నటి రోజు డప్పు కొట్టకపోతే కుల బహిష్కరణ చేసిన వారిపైన చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు డిమాండ్ చేశారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా అధికారులు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.