సిరాన్యూస్,ఆదిలాబాద్
సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టం : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు
* సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం పని చేయాలి
సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి అధ్యక్షతన నిర్వహించారు . ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు ,యావత్తు దేశ రాజకీయాలకు తీరని లోటని అయన అన్నారు . దేశం గొప్ప రాజకీయ మేధావిని కోల్పోయింది అన్నారు . దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టుకలిగిన నేత సీతారాం ఏచూరి అనికొనియాడారు . విద్యార్థి దశలోనే ఎర్రజెండా భావాలవైపు మళ్లారు ,జే.ఎన్.యు.లో ఎస్ఎఫ్ఐ నుండీ మూడుసార్లు అధ్యక్షునిగా గెలుపొందారు అన్నారు . వైస్ ఛాన్సలర్ గా ఇందిరగాందీ రాజీనామా చేయాలనీ తన ఇంటికే విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి హైరాన్ లేడీగా పేరున్న ఇందిరా గాంధీనీ తనముందే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారన్నారు . యూపీఏ మొదటి ప్రభుత్వం లో కామన్ మినీమమ్ ప్రోగ్రాం రుపొందించడం కీలక పాత్ర పోసించారన్నారు .విదేశ కమ్యూనిస్టులతోనూ అవినాభావ సంబంధాలు కొనసాగించారని కొనియాడారు .పార్లమెంట్ సభ్యుడిగా 10సం”రాలు సేవలందించారు , బెస్ట్ పార్లమెంటిరియన్ గా పేరుతెచ్చుకున్నారు ,సిద్ధాంత విభేదాలు మరిచి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారితో ప్రశంసలు పొందారన్నారు . బ్రతికుండా దేశానికి సేవచేయడమే కాకుండా మరణించాక కూడా ఎయిన్స్ రీచర్చు నిమిత్తం తన బాడీని దహనం చేసి దేశానికి సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు . దేశం నేడు క్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు ఒక పక్క ఆర్థిక సంక్షోభం మరో పక్కా రాజకీయాల్లోకి మతోన్మాద పోకడలు చొరబాడ్డాయన్నారు . ఈ లాంటి స్థితిలో దేశ రాజకీయాలకు ఏచూరి సేవలు ఎంతో అవసరం ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు . కమ్యూనిస్టు లు శ్రేణులు సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం పని చేయాలనీ పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ , పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు ,అన్నమొల్ల కిరణ్ ,పూసం సచిన్ ,జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న,ఆర్.మంజుల ఆర్.సురేందర్, ఎం.గంగన్న ,ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున ,నాయకులు , కోవే శకుంతల అగ్గిమల్లస్వామి, ఎన్.స్వామి, పండగ పొచ్చన్న ,ప్రవీణ్ , తదితరులు పాల్గొన్నారు .