సిరాన్యూస్ ,ఖానాపూర్
మద్యం మత్తులో డయల్ 100 కు ఫోన్ …రెండు రోజుల జైలు శిక్ష : ఎస్సై జి లింబాద్రి
మద్యం మత్తులో డయల్ 100 కు పలుమార్లు ఫోన్ చేసిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై జి లింబాద్రి శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ (38) అను వ్యక్తి మద్యం సేవించి అనేకసార్లు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నెంబర్ కు కాల్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న శివరాత్రి లక్ష్మణ్ వ్యక్తి కేసు పెట్టి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించారు. అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నంబర్ ను దుర్వినియోగం చేయకుండా ఆపదలో ఉన్నవారికి సహాయ పడే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎవరు కూడా అనవసరంగా పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని పలుమార్లు చేినటలయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు తెలిపారు.