సిరాన్యూస్, బేల
సిర్సన్న గ్రామాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్ల
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో ట్రైనీ అధికారులు గత రెండు రోజుల నుండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పైన ఆరా తీశారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ గ్రామస్తులతో మమేకమై ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. దీంట్లో భాగంగా గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఇంకుడు గుంతలు,మరుగుదొడ్ల నిర్మాణం,అదేవిధంగా రేషన్ షాప్,ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ పిల్లలతో చర్చించి,పల్లె ప్రకృతి వనం,రైతు వేదిక ఇలా కొన్ని ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. వివిధ క్యాడర్ లకు సంబందించిన శివమ్, పనీత్, సోనియా, నమ్రత, రవికుమార్ ఐదుగురు శిక్షణ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ అధికారులు మాట్లాడుతూ మా శిక్షణలో భాగంగా బుధవారం సిర్సన్న గ్రామానికి రావడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల యాక్టివిటీ గురించి వివరించారు. దీని బేస్ గా చేసి వాటిని క్షుణ్ణంగా ఐదు రోజులు పరిశీలించినా తరువాత తమ రిపోర్ట్ నీ మరిచెన్న రెడ్డి శిక్షణ కేంద్రానికి పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.