సిరా న్యూస్,తిరుపతి;
ఆంధ్రప్రదేశ్ యువత కోసం చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ వర్శిటీనీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే కసరత్తు చేస్తోంది. అయితే స్కిల్ యూనివర్శిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి జల్లా ఏర్పేడు మండలం కొబాక దగ్గర 50 ఎకరాల స్థలంలో వర్శిటీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఈ యూనివర్శిటీకి వర్సిటీకి ఛైర్మన్‌గా వ్యాపారవేత్తలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారట.గత ప్రభుత్వం స్కిల్ వర్సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించింది.. కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదు. అందుకే ఏర్పేడు దగ్గర భూములు అందుబాటులో ఉండటంతో.. అక్కడ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ నిర్ణయించినట్ల తెలుస్తోంది. ఈ స్కిల్ వర్శిటీకి ప్రముఖ వ్యాపారవేత్తలను ఛైర్మన్, కో ఛైర్మన్‌లుగా నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. పరిశ్రమల ద్వారా విద్యా ప్రణాళిక రూపకల్పన, యువతకు అవసరమైన శిక్షణ అందించాలని ఆలోచన చేస్తున్నారట. ఈ స్కిల్ యూనివర్శిటీలకు అనుబంధంగా.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ కాలేజీలను కూడా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ వర్శిటీ, అనుబంధ కాలేజీల ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ, చదువుకుంటున్న యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.ఈ స్కిల్ యూనివర్శిటీ ద్వారా.. రాష్ట్రంలో మెగా పరిశ్రమల సొంత క్యాంపస్‌లు, మధ్యతరహా, చిన్న పరిశ్రమల నైపుణ్య శిక్షణ కేంద్రాలను భారీగా పెంచాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కిల్ శిక్షణ కేంద్రాలు 55 వరకు ఉండగా.. వాటిని 155కు పెంచబోతున్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాలకు తగిన విధంగా కూడా శిక్షణ ఇస్తారు. అంతేకాదు ఇంటర్మీడియట్‌లోపు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకూ కూడా వారికి తగిన విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ఉత్పత్తి, సేవల రంగాల్లో శిక్షణ ఇస్తారు. అలాగే రాష్ట్రంలో నైపుణ్య గణన పూర్తయ్యాకి.. ఆ నివేదకల్ని పరిశీలించనుంది