సిరాన్యూస్, జైనథ్
జైనథ్ కస్తూర్బాలో బతుకమ్మ సంబరాలు : ఎస్ఓ వీణా కుమారి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎస్ఓ వీణా కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో బతుకమ్మ ఆడారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పువ్వుల పండుగ అయిన బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా జరపడం చాలా గొప్ప విషయం అన్నారు. మహిళలు జరుపుకొనే బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా జరపడం అంటే మహిళలు అందరిని గౌరవించడమే అవుతుంది అన్నార. వివిధ రకాల పువ్వులు సేకరించి పాఠశాలలో బతుకమ్మలు పేర్చామని అన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మ పండుగ జరపడం ఆ పువ్వుల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల పువ్వుల ఔషద గుణాలు అన్ని నీళ్ళలో చేరి ,నీరు శుభ్రంగా అవుతుందని తెలిపారు. ఔషధ గుణాలు వున్న నీటిని తాగే వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు.