సిరాన్యూస్, కళ్యాణదుర్గం
చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ రాజశ్రీ
* గోళ్లలో గ్రామసభ
యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజశ్రీ అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గం రూరల్ యుపిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గోళ్ల గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్బంగా రాజశ్రీ మాట్లాడారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్, సైబర్ క్రైమ్ ల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. గ్రామంలో ఎంట్రీ ,ఎగ్జిట్ పాయింట్లు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటి వల్ల దొంగతనాలు అరికట్ట వచ్చని తెలిపారు.