సిరాన్యూస్, భద్రాద్రి
నిషేధిత సీపీఐ మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ రోహిత్ రాజు
* ఏడూళ్ల బయ్యారం, కరకగూడెం పోలీస్ స్టేషన్ల సందర్శన
నిషేధిత సీపీఐ మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఏడూళ్ల బయ్యారం మరియు కరకగూడెం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు.అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీస్ అధికారులు,సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.ముందుగా పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి పోలీస్ శాఖ తరఫున కేటాయించిన ప్రభుత్వ సామాగ్రిని పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.విధులపరంగా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.వర్తికల్స్ వారీగా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని,ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు.కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత అందరికి చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించే విధంగా పలు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.కార్యక్రమంలో ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,కరకగూడెం ఎస్సై రాజేందర్,ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ టిఎస్ఎస్పి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.