సిరా న్యూస్, జైనథ్:
ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు
– కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి
గ్రామస్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ద్వారా జైనథ్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డిలు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల కోసం చాంద మీదుగా లక్ష్మిపూర్ గ్రామం వరకు ఆర్టీసీ బస్సు నడపాలని ఈనెల 15వ తేదీన ఆర్టీసీ డీఎం కల్పనకు గ్రామస్తులతో కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ డీఎంతో పాటు అధికారులకు ఆదివారం బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం పట్ల గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.