సిరా న్యూస్,కాకినాడ;
వైద్య విద్యార్ధులు తమ వ్యక్తిగత ఆరోగ్యం కోసం, ఎంతో కొంత ఫిజికల్ ఫిట్నెస్ కు సమయం కేటాయించాలని తద్వారా భవిష్యత్లో వృత్తిపరమైన ఒత్తిళ్ళను అధిగమించవచ్చని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ భరణి పేర్కోన్నారు.
కాకినాడీ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆర్.ఎం.సి. 66వ కాలేజ్ యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రెషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్.ఎం.సి. స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ డా॥ఉమామహేశ్వరరావు అద్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణ ముఖ్యఅతిధి గాను డి.ఎం.ఇ. డా॥డి.వి.ఎల్.నరసింహ్మం విశిష్ట అతిధిగోను కాకినాడ జి.జి.హెచ్. డిప్యూటి సూపరిండెంట్ శ్రీనివాస్, ఆర్.ఎం.సి. వైస్ ప్రిన్సిపాల్ డా॥ విష్ణువర్ధన్ గౌరవ అతిధులుగా పాల్గొ న్నారు. తొలుత అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్.ఎం.సి. స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ డా॥ ఉమామహేశ్వరరావు యాన్యువల్ స్పోర్ట్స్ రిపోర్టును సమర్పించారు. ఆర్.ఎం.సీ వైస్ ప్రిన్సిపాల్ డా॥ విష్ణువర్దన్ మాట్లాడుతూ యూనివర్శిటీ స్పోర్ట్స్ మీట్స్లో కాలేజీ విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి మెడల్ను సాధించారన్నారు. జి.జి.హెచ్. డిప్యూటి సూపరిండెంట్ డా॥శ్రీనివాసన్ మాట్లాడుతూ మెడల్స్ను సాధించిన విద్యార్థులను అభినందిం చారు.డి.ఎం.ఇ.డా॥నరసింహ్మం మాట్లాడుతూ ఆర్.ఎం.సి. విద్యార్ధులు అకడమిక్స్ లోను, స్పోర్ట్స్ మీట్స్లోను మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. ముఖ్యఅతిధి డీ.ఎఫ్.ఒ. భరణి మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఇప్పటి నుండే ఎదో ఒక స్పోర్ట్ను ఎంచుకుని ఫిజికల్ ఫిటెనెస్ సాధించాలన్నా రు.అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో విన్నర్స్, రన్నర్స్కు బహుమతి ప్రదానోత్సవం జరిగిం ది.ముఖ్యఅతిధి భరణి, డా॥ నరసింహ్మం, డా॥ శ్రీనివాస్, డా|| విష్ణువర్దన్, డా॥ ఉమామహేశ్వరరావు డా॥ శ్రీనివాస్ డా॥ ముఖర్జీ ల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు. ఈకార్యక్రమంలో హెచ్.ఒ.డి.లు, కాలేజ్ లేక్చరర్స్, లైబ్రరియన్స్, ఇన్చార్జ్ పి.డి. లక్ష్మణరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు