సిరాన్యూస్, బేల
బేల కీర్తన డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు, కళాశాలలోని విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ ఆడుతూ పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో ని కీర్తన డిగ్రీ కాలేజ్ ఆవరణలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సాంస్కృతిక విభాగం ఇంచార్జి తి పుష్ప మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో బతుకమ్మ పండుగ కీలకం అని సహజ సిద్ధంగా లభించే పూలను పేర్చి నది లో నిమజ్జనం చేయడం వలన నీళ్లు శుభ్రం గా మారుతాయి అని అన్నారు. మరాఠీ విభాగం ఇంచార్జి ప్రియాంక మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లో బతుకమ్మను అందరు కలిసి చేసుకోవడం వలన ఐకమత్యం పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డా గెడం ప్రవీణ్, మహిళ అధ్యాపకులు బిందు, సౌందర్య, విజయ ,సీనియర్ అధ్యాపకులు ఆమోల్, కిష్టారెడ్డి, సాగర్ సంజీవ్, బోధనేతర సిబ్బంది అనికేత్, అర్చన, అహ్మద్ ఖాన్, పాల్గొన్నారు.