సిరా న్యూస్, ఆదిలాబాద్:
పదిలో ప్రభంజనం సృష్టించిన ఎస్‌ఆర్ విద్యాసంస్థ
+ ముగ్గురికి 10 జీపీఏ
+ మరో 8మందికి 9.8 జీపీఏ
+ వంద శాతం ఉత్తీర్ణత
ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్‌ఆర్ విద్యాసంస్థ పది ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. మంగళవారం ప్రకటించిన పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఏళ్లుగా నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఎస్‌ఆర్ విద్యాసంస్థ ఈ ఏడాది కూడ అత్యుత్తమ ఫలితాలతో ముందంజలో నిలిచింది. పాఠశాలకు చెందిన హరిప్రియ, శ్లోక, కావేరి అనే ముగ్గురు విద్యార్థినిలు 10జీపీఏ స్వంతం చేసుకున్నారు. వీరితో పాటు మరో 8మంది విద్యార్థులకు 9.8 జీపీఏ వచ్చినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాద్యాయులు, యాజమాన్యం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. జీవితంలో ఇలాంటి మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జోనల్ ఇంచార్జీ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ క్రాంతి కుమార్, కిరణ్ కుమార్, ఇతర ఉపాద్యాయులు పాల్గొన్నారు.