సిరాన్యూస్, ఖానాపూర్
ఖానాపూర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఏడీఈ కిశెట్టి శ్రీనివాస్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో 132 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఈనెల 10న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఖానాపూర్ ఏడీఈ కిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఖానాపూర్, పెంబి, కడెం,మామడ దస్తూరాబాద్ మండలాల్లోని గ్రామాలకు ఈనెల 10న ఉదయం 8:30 – 9:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.