సిరాన్యూస్, ఖానాపూర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి: బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్
* తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఖానాపూర్ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. రైతులకు రైతుబంధు, రైతు రుణమాఫీ ,పంటలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతులకు పెన్షన్ వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు టేకు ప్రకాష్, ప్రధాన కార్యదర్శిలు పెద్ది రమేష్ , కొండవీని రమేష్, దాసరి శ్రీనివాస్, పొద్దుటూరి గోపాల్ రెడ్డి, ఎనుగందుల రవి ,గట్టు శ్రీనివాస్, నరేష్, తదితరులు పాల్గొన్నారు