సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఇంచార్జ్ జీపీగా జే నరేందర్…
+ శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాదులు
ఆదిలాబాద్ జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడర్ (జీపీ) గా ప్రముఖ న్యాయవాది జే నరేందర్ నియమితులయ్యారు. ప్రస్తుతం జీపీగా పనిచేస్తున్న ఈశ్వర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఇంచార్జ్ జీపీగా నరేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, ఇతర న్యాయవాదులు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.