డీజీపీ కి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..
సిరా న్యూస్,హైదరాబాద్;
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహ రించాలని డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌పై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు.ఇవాళ లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించను న్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో సీరియస్‌గా ఉండాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారం పోయిందనే అక్కసుతో కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. సైబరాబాద్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడ దన్న డీజీపీ శాంతిభద్రతల కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందన్నారు. ప్రజలందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు.