సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ రామంతపూర్ ప్రిన్సిటన్ డిగ్రీ కళాశాల వద్ద తన సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదంటూ హృదయ్ అనే విద్యార్థి ధర్నాకు దిగాడు. విద్యార్థికి ఎబివిపి మద్దతుగా నిలిచింది. కళాశాల ఫీస్ చెల్లించినా కూడా విద్యార్థికి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడంలేదు. 2020లో డిగ్రీ బీకాన్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యి హృదయ్ డిగ్రీ బీకామ్ పూర్తి చేసాడు. తన డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగితే నెల రోజులుగా కళాశాల చుట్టూ తిప్పుతున్నాడు. విసిగిపోయిన విద్యార్థి హృదయ్, రెండు రోజుల క్రితం ఉప్పల్ పిఎస్ లో కళాశాలపై విద్యార్థి హృదయ్ పిర్యాదు చేసాడు.