సిరా న్యూస్, లోకేశ్వరం:
మెదడులో రక్త గడ్డ కట్టి విద్యార్థిని మృతి
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన లోలం భూమయ్య కూతురు లోలం తేజుకు బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడంతో శనివారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బెల్లంపల్లి హాస్టల్లో ఉంటూ పదవ తరగతి చదువుతున్న తేజు మృతి చెందడంతో ఆదివారం ఉదయం ఆమె మృత దేహాన్ని స్వగ్రామైన అబ్దుల్లాపూర్కు తరలించారు. కాగా నిన్న మొన్నటి దాక కళ్ల ముందే కదిలిన తమ కూతురు ఒక్కసారిగా మృతి చెందడంతో కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.