సిరా న్యూస్ ,తలమడుగు:
వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణి…
+ ఉదారత చాటిన లిటిల్ స్టార్ పాఠశాల విద్యార్థులు
తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో అదిలాబాద్ లిటిల్ స్టార్ హై స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి తమ ఉదారత చాటుకున్నారు. శనివారం సాయిలింగి వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ మేరకు వృద్ధులకు దుప్పట్లతోపాటు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం గావించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు జ్యోత్స్న మాట్లాడుతూ.. ఏడవ తరగతి విద్యార్థులకు నాయనమ్మ పాఠ్యాంశం బోధించడం జరిగిందని అన్నారు. కొంతమంది వృద్ధులు తమ జీవితపు మలి సంధ్యలో పడుతున్న ఇబ్బందులను తెలియజేయడంతో పాటు వారికి సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సందర్భంగా విద్యార్థులు ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కమలాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ స్వరూప, ఉపాధ్యాయులు సంగీతం, కవిత, ప్రత్యూష, నారాయణ, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.