అయ్యో పాపం..
+ రాత్రివేళ ఒంటరిగా బిక్కుబిక్కుమంటు చిన్నారి
+ మాటలు రాకపోవడంతో వివరాలు చెప్పలేని స్థితిలో చిన్నారి
+ పోలీస్ స్టేషన్ కు తరలించిన గ్రామస్తులు
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామం సమీపంలోని వైజాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రాత్రివేళ ఒంటరిగా ఓ చిన్నారి కనిపించడం కలకలం రేపింది. అటుగా వెళుతున్న స్థానికులు రోడ్డుపై చిన్నారిని గుర్తించడంతో, వివరాలు అడిగేందుకు మాటలు కలిపారు. తనకు మాటలు రావని ఆ చిన్నారి మూగ సైగలతో చెప్పడంతో స్థానికులు విస్తు పోయారు. గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అందించి, చిన్నారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఆ చిన్నారి క్షేమంగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా పాప వివరాలు తెలిసిన వాళ్ళు +918712996993, 8712659936 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్సై ఇమ్రాన్ తెలిపారు.