సిరా న్యూస్,పరవాడ;
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు భాగంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలంకు పర్యటనకు విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు వెన్నెల పాలెం గ్రామపంచాయతీలో సుమారు 86 క్రిస్టియన్స్ కుటుంబాలకు స్మశాన వాటిక కొరకు గతంలో గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసి ఉన్నారని స్థలం లేకపోవడం వలన ఎవ్వరైనా చనిపోతే వారికీ చివరి కార్యక్రమాలు చెయ్యడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని దీనిపై వెంటనే స్పందించి వారికి స్థలం కేటాయించాలని స్థానిక ఉపసర్పంచ్ వెన్నెల సన్యాసిరావు వారి తరపున ఎమ్మెల్యే రమేష్ బాబు కు వినతి పత్రం అందచేశారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,పంచాయతీ అధికారులు,సచివాలయం సిబ్బంది మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.