గుడికంబాలి గ్రామము నందు సీసీ రోడ్డులకు భూమీ పూజా కార్యక్రమాలు
సిరా న్యూస్,కౌతాళం;
రాష్ట్ర కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో అభివృద్ది పూనుకోవాలి,దేశానికి వెన్నెముక పల్లె,అలాంటిది పల్లె బాగుంటునే దేశం బాగుంటుందని భావించిన నేటి ప్రభుత్వం.మన కూటమి ప్రభుత్వము ఏర్పడిన 100 రోజులోనే నేరుగా గ్రామానికి అధికారులు వచ్చి సమస్యలను గ్రామ సభ ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే పరిష్కరించే దిశగా పల్లె పండుగ కార్యక్రమంతో నేడు గ్రామములో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు.గత ప్రభుత్వము పంచాయితీ డబ్బును దారి మళ్ళించి గ్రామ పంచాయితీ వ్యవస్థకు భ్రష్టు పట్టించిందని నేడు కూటమి ప్రభుత్వంతో పంచాయితీ వ్యవస్థ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్,చిన్న సిద్దయ్య,సుబ్రమణ్య రాజు, నాగేశ్వరావు,బిజెపి నాయకులు హనుమంతు,జనసేన మండల నాయకులు రామాంజినేయులు,యువ నాయకులు ,సతీష్ నాయుడు సురేష్ నాయుడు,మరియు గ్రామ నాయకులు మల్లప్ప గౌడ్, మాజీ సర్పంచ్ మరియు గుడిసిలి గోపాల్,రెనప్ప,దేవన్న,అంపయ్య,శ్రీనివాస్,రిషి,ఖాజా,హజరత్,మరేశ్,రిషి, రమేష్,శరణ మొదలగు కూటమి పార్టీ నాయకులు సిద్ధన్న గౌడ్,లక్కే గోవిందు, శివమూర్తి, రోహిత్ మొదలగు గ్రామ సంబధిత అధికారులు పాల్గొనడం జరిగినది