సిరాన్యూస్, ఓదెల
సీసీ కెమెరాలను ప్రారంభించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనపర్తి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.ఈ కార్యక్రమంలో పోత్కపల్లి ఎస్సైజి అశోక్ రెడ్డి , కనపర్తి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.