సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
మండ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరామణారావు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జoపేట గ్రామానికి చెందిన మండ సురేష్ ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సొసైటీ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం గౌడ్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీ మొగిలి సదానందం, రామిడి తిరుపతి రెడ్డి, మాజీ వార్డు మెంబర్ నరెడ్ల శంకర్, కాంగ్రెస్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.