సిరాన్యూస్, ఆదిలాబాద్
టీఏఎంబీఏ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్య
తెలంగాణ ఆల్ మ్యారేజి బ్యూరో అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్య నియమాకమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ శివారుని శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి సన్నిధిలో తెలంగాణ ఆల్ మ్యారేజి బ్యూరో అసోసియేషన్ (తంబ) రాష్ట్ర స్థాయి 5వ మహాసభలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్యను నియమించినట్లు తెలంగాణ అల్ మ్యారేజి బ్యూరో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి ధర్మేంధర్ ప్రకటించారు. అనంతరం కేశవేణి రాజయ్యను శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మహా సభలకు వివిధ జిల్లానుండి పెద్ద ఎత్హున ప్రజలు రావడంతో చాలా సందడిగా మారింది. అనంతరం మహిళలు బతుకమ్మ పువ్వులతో పెరిచ్చి బతకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈమహా సభలకు మంచిర్యాల జిల్లా అధ్యకులు బలిశెట్టి లక్ష్మణ్, రాష్ట్ర సలహాదారులు బోనాల మల్లయ్య ,రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుండేటి కృష్ణ వివిధ జిల్లాల ఆధ్యకులు, కార్యదర్శులు, మ్యారేజి బ్యూరో సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గా కొత్తపెళ్లి విట్ఠల్,కోశాధికారిగా బొమ్మెత సుభాష్, గురవయ్య,స్వామి సుజాత, విజయలక్ష్మి తధితరులు పాల్గొన్నారు.