సిర్యానూస్, భీమదేవరపల్లి
బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన మాజీ ఉప ముఖ్య మంత్రి తాటి కొండ రాజయ్య
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కండె చక్రపాణి,కండె స్వామి తండ్రి కండె రాజయ్య అనారోగ్యం తో ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, రాష్ట్ర అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో పరామర్శించారు. అనంతరం తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, రాష్ట్ర అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ తో పాటు మాజీ సర్పంచ్ కండె రమేష్, రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులుకండె సుధాకర్, కండె సంజీవ్, ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ ఇన్‌చార్జ్ మాట్ల వెంకటస్వామి, తాజా మాజీ వార్డ్ మెంబర్ గిన్నారపు కుమారస్వామి, బిసి నాయకులు వేముల జగదీష్, బీఆర్ఎస్ నాయకులు గజ్జెల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.