సిసి రోడ్డుకు భూమి పూజ చేసిన టీడీపీ నాయకులు
గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
సర్పంచ్ గౌరవ సలహాదారులు ప్రతాప్ యాదవ్
సిరా న్యూస్,తుగ్గలి;
రాష్ట్రంలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిరవధికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కే.యి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండలంలోని బొందిమడుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప, సర్పంచ్ గౌరవ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్ ఆధ్వర్యంలో తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు వెంకట రాముడు చౌదరి పలువురు టీడీపీ నాయకులు పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం రోజున ఘనంగా ప్రారంభించారు.అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తుగ్గలి మండల ఎపివో హేమ సుందర్,గ్రామ పంచాయతీ సెక్రటరీ చిన్న వెంకటేష్, గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శంకర్ నేతృత్వంలో గ్రామంలోని బిసి కాలనిలో చాకలి ఈశ్వరయ్య ఇంటి దగ్గర నుంచి సుమారు వంద మీటర్లు సిసి రోడ్డు పనులకు పూజా కార్యక్రమాలతో టీడీపీ నాయకులు భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు గ్రామ ప్రెసిడెంట్ సలహాదారులు ఎస్. ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని,రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశాలు బాగుంటాయని,గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివని,గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపించే భాద్యతను రాష్ట్ర డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామాల్లోని నాయకులకు పూర్తి భాద్యతగా అప్పజెప్పడం సంతోషమని, గ్రామాల అభివృద్ధికీ నిరంతరం కృషి చేస్తామని గ్రామాల అభివృద్దే రాష్ట్రాభివృద్ధి అని టీడీపీ నాయకులు సర్పంచ్ సలహాదారులు ఎస్. ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో తుగ్గలి ఈఓఆర్డి శ్రీహరి,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రామారావు మరియు టీడీపీ నాయకులు పెండేకల్ మాజీ సర్పంచ్ బర్మా వీరేష్,మామిళ్లకుంట తిమ్మప్ప, బొందిమడుగుల వీరేంద్ర,హుసేన్, వెంకటేష్,వై. జయచంద్ర,వెంకట రాముడు, సుంకన్న,ధనుంజయ, సుదర్శన్,రంగన్న,నేషే నాగేష్,మంగలి లక్ష్మీ నారాయణ,మనోహర్,కోదండ రాముడు,రామరావు,సుధాకర్, సుబ్బ రాయుడు,పులికొండ,డాక్టర్ సురేష్, లక్ష్మణ స్వామి మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.