సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
ముక్కంటి ఆలయంలోని అష్టోత్తర శివలింగం వెనుక భాగంలో బిల్వం చెట్టు కింద శివలింగం ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది దర్శనార్థం వచ్చే భక్తులు బిల్వ వృక్షం కింద ఉన్న శివలింగాన్ని ప్రదక్షిణగా వస్తుంటారు మంగళవారం కురిసిన భారీ వర్షంతో పై కప్పు నుంచి పడే నీటి ధారలు బిల్వ దళాలను తాకుతూ శివయ్య పై పడటంతో భక్తులు ఆత్మానందాన్ని పొందారు వరుణుడు శివయ్యకు అభిషేకం చేసే విధంగా ఉండటంతో చాలామంది భక్తులు శివలింగంపై నుంచి కిందకు పడే జలాలను ఎంతో పవిత్రంగా శిరస్సుపై చల్లుకుని ముక్కంటీ దర్శనానికి వెళ్లడం విశేషం