TDP Morepalli Mallikarjuna: గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం : టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం : టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున

గుంతల రహిత ఆంధ్రప్రదేశే మా ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున అన్నారు. శనివారం పట్టణంలోని హిందూపురం రోడ్డులో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి డీఈ ప్రసాద్, ఏఈఈ లు,పార్టీ కన్వీనర్ లు గోళ్ళ వెంకటేశులు, పట్టణ కన్వీనర్ శర్మస్ వలి, మాజీ కన్వీనర్ డిష్ మురళి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజినేయులు,మాజీ కన్వీనర్ డీకే రామాంజినేయులు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు అబ్దుల్ రహీం, శ్రీనివాసరెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఒంటిమిద్ది తలారి సత్తి,మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప,ఆర్అండ్ బి అధికారులతో కలిసి రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.నియోజకవర్గం లో ఎక్కడా గుంతల రోడ్లు లేకుండా మరమ్మత్తులు చేయడమే మా అమిలినేని సురేంద్ర బాబు లక్ష్యం అన్నారు. ప్రధాన రహదారుల మరమ్మత్తులు చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. మా ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రహదారుల అభివృద్ధి చేస్తుందన్నారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి గంప మట్టి కూడా వేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చందుకు మా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. మా ప్రాంతం అభివృద్ధి కోసం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా గుంతల రోడ్లకు రూ.1.81కోట్లు మంజురయ్యాయని అన్నారు. వచ్చే సంక్రాతి లోపు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శామీర్,గోళ్ళ రమేష్, రామాంజినేయులు, ఉటంకి రామాంజినేయులు, సునీల్, మంజునాథ్ రెడ్డి, పార్టీ కార్యదర్శి నాగరాజు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *