సిరాన్యూస్, జైనథ్
ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెంటపర్తి ఊశన్నకు ఘన సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెంటపర్తి ఊశన్నను బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల జామినిలో ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు , గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పెంటపర్తి ఊశన్న కు రావడం మా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను బహిర్గతం చేయడమే ఉపాధ్యాయుల లక్ష్యం అని అన్నారు.గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధి చేస్తామని అన్నారు. అవార్డు అందుకోవడం అనేది ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, ఉత్సాహం వస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ దేవుబాయి ,మాజీ సర్పంచ్ పెందూర్ మోహన్, ఉపాధ్యాయురాళ్ళు జ్యోతి, జయశ్రీ ఉపాధ్యాయులు లక్ష్మణ్, దూస గంగన్న ,పెంటపర్తి ఊశన్న, గ్రామస్తులు ఇందుబాయి, యశోద, ప్రతిభ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.