సిరాన్యూస్, సామర్లకోట
థియేటర్లను తనిఖీ చేసిన తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి
దేవర సినిమా విడుదల సందర్భంగా గురువారం జయలక్ష్మి, విఘ్నేశ్వరా థియేటర్ లను సామర్లకోట తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్ శుక్రవారం ఉదయం దేవర సినిమా విడుదల సందర్భంగా తీసుకునే చర్యల గురించి చర్చించారు. అదే విధంగా ప్రభుత్వము ఇప్పటికే పెంచిన రేట్లకు అదనంగా పెంచరాదని అన్నారు. థియేటర్ల లోని శానిటేషన్ వంటివి పరిశీలించారు. స్థానిక పోలీసు వారికి కూడా ముందు జాగ్రత్తలు తీసుకోమని తహసీల్దార్ సూచించారు.