సిరాన్యూస్,సామర్లకోట
సహాయం చేయడానికి ముందుకు రావాలి: తహసీల్దార్ శ్రీనివాస్
ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు రావాలి అని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయవాడలోని వరద భాదితుల సహాయార్ధం తహశీల్దారు, పెంటపాడు వారి ఆద్వర్యంలో పెంటపాడు మండలంలోని అన్ని గ్రామములోని పెద్దలు, ప్రజలు పెట్రోలు బంకుల వారి సహకారముతో బిస్కట్ ప్యాకెట్స్ – 6200, వాటర్ బాటిల్స్ – 1400, పాలు (టెట్రా ప్యాకేట్స్)- 2600, రస్కుల్ ప్యాకెట్స్- 1400 సేకరించారు. ఈసందర్బంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం తహసీల్దార్ శ్రీనివాస్కార్యాలయ సిబంది విజయవాడ వరద బాధితులకు ఆహారం,మంచి నీరు, కావాల్సిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.