సిరాన్యూస్, సామర్లకోట
ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : తహసీల్దార్ శ్రీనివాసు
* విజయవాడకు పెంటపాడు నుండి ఆహారపోట్లలు అందజేత
వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పెంటపాడు తహసీల్దార్ శ్రీనివాసు అన్నారు . పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు నుంచి మంగళవారం పెంటపాడు లో ఉన్న ప్రత్తి పాడు ఫుడ్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కర్మాగారం నుండి విజయవాడ వరద బాధితులకు ఆహారపోట్లలను వ్యాన్ లో తరలించారు. ప్రజలు తమ ఉదారత ను చాటు కోవాల్సిన సమయం వచ్చింది అని శ్రీనివాస్ అన్నారు. ఫ్యాక్టరీ యజమాని ఓపీ గోయాంక తదితర సిబంది పాల్గొన్నారు.