సిరా న్యూస్,ములుగు;
మదనపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపింది. మదనపల్లి, పత్తిపళ్లి, పొట్లాపూర్, దేవగిరిపట్నం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాకాల నుండి ములుగు అటవీప్రాంతానికి చిరుత వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా చిరుత సంచారాన్ని గుర్తించారు. దాంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది, 30 మంది సిబ్బందితో ట్రాకింగ్ చేస్తున్నారు. పశువుల కాపరులు, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడవుల్లోకి వెళ్ళకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసారు.